రామాయణ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

Release Date Locked for Ramayana First Glimpse

నితేష్ తివారీ దర్శకత్వంలో ఇండియన్ సినిమా గర్వించదగ్గ రీతిలో రూపొందుతున్న విజువల్ వండర్ ‘రామాయణ’ చిత్రానికి సంబంధించి ఒక భారీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా గ్లింప్స్ విడుదల తేదీని ఈరోజు శ్రీరామనవమి సందర్బంగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మెగా ప్రాజెక్ట్ ఫస్ట్ గ్లింప్స్‌ను ఏప్రిల్ 2 , 2026న హనుమాన్ జయంతి సందర్బంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. రావణాసురుడిగా కన్నడ స్టార్ యష్ నటిస్తుండగా, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించనున్నారు.

హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఆస్కార్ గెలుచుకున్న సంస్థలతో ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. సుమారు 800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ మరియు హాన్జ్ జిమ్మెర్ సంయుక్తంగా ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.ఈ సినిమాలో రావణుడిగా యష్ లుక్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈఏడాది దీపావళికి ఫస్ట్ పార్ట్ థియేటర్లలోకి రానుంది. ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.