మాస్ మహారాజా రవి తేజ ప్రస్తుతం తన ‘ఇరుముడి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది.ఈసినిమా నుండి రీసెంట్ గా విడుదలైన పోస్టర్స్ అందరిలోనూ క్యూరియాసిటీని పెంచేసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోండగా ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం చిత్ర బృందం హైదరాబాద్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తోంది. అనల్ అరసు, రియల్ సతీష్ స్టంట్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో చూడనటువంటి అత్యంత అద్భుతమైన ఫైట్లను ప్రేక్షకులు చూడబోతున్నారని టీం చెబుతోంది.
యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ ‘ఇరుముడి’లో అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉంటుంది. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉండబోతోన్నాయని మేకర్స్ వదిలిన పోస్టర్స్, కంటెంట్ చెబుతోంది. దర్శకుడు శివ నిర్వాణ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్కు అవసరమైన అన్ని అంశాలను, బలమైన భావోద్వేగ ప్రధానాంశంతో సమతుల్యం చేస్తూ ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌ను రూపొందించారు.
రవి తేజ తాను ఇంతకు ముందు పోషించిన పాత్రల్లన్నింటిలోనూ భిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తన కుమార్తెగా నటించిన బేబీ నక్షత్రతో రవి తేజకు ఉన్న బంధాన్ని చూపిస్తూ, చిత్ర బృందం నిన్న ఒక అందమైన, ఆకట్టుకునే పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో రవి తేజ వింటేజ్, విలేజ్, మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. సాధారణ చెక్డ్ షర్ట్, లుంగీ ధరించి తన కుమార్తెతో కలిసి నడుస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే తండ్రీకూతుళ్లు మధ్య మంచి ఎమోషనల్ సీన్లను సినిమాలో చూపించేలా ఉన్నారనిపిస్తోంది.
సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలవనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























