మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక అందింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న క్రీడా నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామా ‘పెద్ది’ నుండి ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్ విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ గ్లింప్స్‌లో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక ఉత్తరాంధ్ర పహిల్వాన్ (కుస్తీ యోధుడు) లుక్‌లో రగ్గడ్ అండ్ మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. భారీ గడ్డం, కండలు తిరిగిన శరీరంతో మట్టి కుస్తీ బరిలో ఆయన ఎంట్రీ అదిరిపోయింది. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.ఓవరాల్ గా ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘జాన్వీ కపూర్’ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు అద్భుతమైన స్వరాలు అందిస్తున్నారు.వృద్ధి సినిమాస్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























