ధురంధర్ : ది రివెంజ్ రన్ టైం రివీల్

Dhurandhar The Revenge Duration Details Revealed

రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన మచ్ అవైటెడ్ సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.రేపే ప్రీమియర్లు పడనుండుగా సరిగ్గా ఒక్క రోజు ముందే సెన్సార్ క్లియరెన్స్ లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

CBFC ఈ చిత్రానికి ‘A’ (అడల్ట్) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సినిమాలో ఉన్న హింస మరియు తీవ్రమైన భాష కారణంగా ఈ రేటింగ్ ఇచ్చారు.ఇక ఈసినిమా రన్ టైం కూడా అఫిషియల్ గా రివీల్ అయ్యింది. దేశ వ్యాప్తంగా ఈసినిమా 3 గంటల 49 నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుండగా ఓవర్సీస్ లో మాత్రం 3 గంటల 52 నిమిషాల నిడివి తో రానుంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది. మొదటి భాగం ‘ధురంధర్’ (214 నిమిషాలు) కంటే ఇది దాదాపు 18 నిమిషాలు ఎక్కువ.

ఈ చిత్రం మార్చి 19, 2026 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అడ్వాన్స్ సేల్స్ పరంగా ఈ సినిమా సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా అడ్వాన్స్ సేల్స్ గ్రాస్ వసూలైంది. ఉత్తర అమెరికాలో ఒక్కటే ఓపెనింగ్ వీకెండ్ నాటికి 4 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధిస్తుందని అంచనా. రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు.

ఒకవైపు తెలుగులో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, మరోవైపు హిందీలో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’ ఒకే రోజు విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.