పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోలకు అనుమతి లభించింది.సినిమా విడుదల రోజున తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య బెనిఫిట్ షో నిర్వహించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాకుండా, సినిమా విడుదలైన తర్వాత పది రోజుల పాటు (మార్చి 19 నుంచి మార్చి 28 వరకు) టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ పెంపు ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 వరకు అదనంగా వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. విడుదలకు ముందు రోజు ప్రత్యేక షోల గురించి ఇంకా స్పష్టత లేనప్పటికీ, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పవన్ కల్యాణ్ అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది.
ఇక ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా ‘యు/ఏ’ సర్టిఫికేట్లభించగా 2 గంటల 34 నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈసినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























