మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ చేతికి హ్యాపీ రాజ్

Mythri Movie Distributors Secure Happy Raj Telugu Theatrical Rights

భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా అద్భుతంగా కొనసాగుతోంది, టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా ఇతర భాషల నుండి కూడా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలను అందిస్తోంది. వారి డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘హ్యాపీ రాజ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించారు. స్టార్ హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తోంది, ప్రమోషనల్ మెటీరియల్‌కు మంచి ఆదరణ లభించింది. కలర్, యాటిట్యూడ్, మాస్ టోన్‌తో అద్భుతమైన ఫస్ట్-లుక్ పోస్టర్‌తో తెలుగు ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి.

జివి ప్రకాష్ కుమార్ కాన్ఫిడెంట్ గా – నల్లటి సూట్, ఓపెన్-కాలర్ షర్ట్, సన్ గ్లాసెస్ ధరించి, స్ట్రీట్ -స్మార్ట్ గా ఆటో రిక్షా నుండి బయటకు వస్తున్న ఫస్ట్ లుక్ స్టైలిష్‌గా అందరిదృష్టిని ఆకర్షించింది.

ఈ చిత్రంలో అబ్బాస్, జార్జ్ , గీతా కైలాసం, ప్రార్థన నాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హ్యాపీ రాజ్ రిఫ్రెషింగ్ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మధన్ క్రిస్టోఫర్, మ్యూజిక్ జస్టిన్ ప్రభాకరన్, ఎడిటర్ ఆర్కె సెల్వ, ప్రొడక్షన్ డిజైనర్ కుమార్ గంగప్పన్

హ్యాపీ రాజ్ మార్చి 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది.మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సపోర్ట్ తో ఈ చిత్రం తెలుగులో స్ట్రాంగ్ రన్ అందుకోనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.