ఉస్తాద్ భగత్ సింగ్ థర్డ్ సింగిల్ రిలీజ్

Third Single from Ustaad Bhagat Singh Out Now

పవన్‌ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్రంలోని మూడవ పాట ‘కాలరే ఎత్తరా’ ఈరోజే గ్రాండ్‌గా విడుదలయ్యింది. హైదరాబాద్‌లోని విమల్ థియేటర్లో జరిగిన ఈవెంట్‌లో చిత్ర బృందం ఈ మాస్ గీతాన్ని విడుదల చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన మార్క్ మాస్ బీట్స్‌తో మరోసారి మ్యాజిక్ చేశారు. రామ్ మిరియాల తనదైన ఎనర్జిటిక్ వాయిస్‌తో ఈ పాటకు ప్రాణం పోశారు. పాట వింటుంటేనే థియేటర్లలో ఫ్యాన్స్ చేసే రచ్చ కళ్ళ ముందు కనిపిస్తోంది.ఇందులో రాశి ఖన్నా ప్రెజెన్స్ కూడా అదిరిపోయింది.

“నెగ్గే దాకా తిక్కే ఉండాలే.. ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా” వంటి పదాలతో కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ పవన్‌ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కు, ఆయన రియల్ లైఫ్ ఆటిట్యూడ్‌కు పక్కాగా సరిపోయాయి. ముఖ్యంగా ‘తిక్క’ అనే పదాన్ని వాడటం పాత ‘గబ్బర్ సింగ్’ వైబ్స్‌ను గుర్తు చేస్తోంది.

దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో పవన్‌ కల్యాణ్ చేసిన ‘హుక్ స్టెప్’ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ. పవన్ తన ట్రేడ్‌మార్క్ స్టైల్‌లో కాలర్ ఎగురవేస్తూ చేసిన స్టెప్పులు అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఈ పాటను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ ఖర్చుతో, రిచ్ విజువల్స్‌తో చిత్రీకరించారు.ఇది కేవలం ఒక పాట మాత్రమే కాదు, పవన్‌ కల్యాణ్ అభిమానులకు ఒక మాస్ ఫీస్ట్. థియేటర్లలో ఈ సాంగ్‌కు విజిల్స్, పేపర్ల వర్షం ఖాయమనిపిస్తోంది.

ఈ పాటతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. మార్చి 14న విడుదల కానున్న ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఇప్పుడే సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.