హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న ‘దీవాన’ చిత్ర టీజర్ నేడు విడుదలైంది.ఈసినిమాతో స్మేహ మణిమేగలై హీరోయిన్ గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఒక ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా కనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే మణిరత్నం సినిమాల్లో ఉండే రొమాంటిక్ ఫీల్ కలుగుతోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెళ్లి వేడుకలో హీరోయిన్ను చూసి హీరో మొదటి చూపులోనే ప్రేమలో పడటం, ఆ తర్వాత ఆమె చుట్టూ తన ప్రపంచాన్ని నిర్మించుకోవడం వంటి అంశాలను టీజర్లో ఆవిష్కరించారు.టీజర్లో వినిపించిన ‘ప్రేమ ఇది ప్రేమ.. గుండెల్లోన సడిరేపేదే ప్రేమ’ అనే పాటలోని నేపథ్య సంగీతం మనసును హత్తుకునేలా ఉంది.
ముఖ్యంగా టీజర్ చివరలో వచ్చే “ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తర్ర ఈ పోరీలు” అనే డైలాగ్ యూత్‌ను ఆకట్టుకుంటోంది. విజువల్స్ చాలా సహజంగా, అందంగా ఉన్నాయి. అర్హ మీడియా మరియు వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































