ప్రీమియం ఫార్మాట్లలో విడుదలకానున్న బైకర్

Biker to Hit Screens in Premium Formats

చార్మింగ్ స్టార్ శర్వా అడ్రెనలిన్‌ ఫిల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బైకర్, భారతదేశంలోనే మొదటి మోటోక్రాస్ స్పెక్టాకిల్‌గా రూపొందుతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నియూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. కుటుంబ భావోద్వేగాలతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మేకర్స్ ఇప్పుడు మరో ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రం డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో కూడా విడుదల కానుంది. దీంతో ప్రేక్షకులకు మరింత ఇమర్సివ్ థియేట్రికల్ అనుభూతి అందించనుంది.

హార్ట్-పౌండింగ్ రేసింగ్ సన్నివేశాలు, భావోద్వేగాలతో కూడిన కథతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో విజువల్స్, సౌండ్ డిజైన్, హై-ఆక్టేన్ యాక్షన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతి బైక్ రోర్, ప్రతి ఎమోషనల్ సన్నివేశం థియేటర్‌లో మరింత ప్రభావం చూపేలా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ టీజర్లు సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేశాయి. ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా బలంగా ఉంది.

ఈ చిత్రంలో శర్వానంద్ డేరింగ్ ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సీనియర్ హీరో రాజశేఖర్ “బుల్లెట్ సునీల్” అనే ఎక్స్ మోటోక్రాస్ లెజెండ్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్‌గా మాళవిక నాయర్ నటిస్తున్నారు.

సినిమాటోగ్రఫీని జె. యువరాజ్ అందిస్తుండగా, సంగీతాన్ని జిబ్రాన్ సమకూరుస్తున్నారు. ఎడిటింగ్ అనిల్ కుమార్ పి నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్‌ను రాజీవన్ రూపొందిస్తున్నారు.

భారీ యాక్షన్, ఎమోషన్స్, టాప్ టెక్నికల్ టీమ్‌తో రూపొందిన “బైకర్” ఈ సమ్మర్ సీజన్‌లో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ థియేట్రికల్ అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.