కోర్ట్ పెయిర్ హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి అపల్లా జంటగా నటించిన ‘బ్యాండ్ మేళం’ చిత్ర విడుదల తేదీలో మార్పు జరిగింది.మొదట ఈ సినిమాను మార్చి 13న విడుదలచేద్దాం అనుకున్నప్పటికీ , తాజాగా చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని, మన సీతారాముల వారి కళ్యాణం రోజున 2026, మార్చి 26న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. “ఈ శ్రీరామ నవమి నాడు, మన సీతారాముల వారి కళ్యాణానికి వస్తున్న మా బ్యాండ్ మేళం” అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు.
మార్చి 26న శ్రీరామనవమి సెలవు ఉండటంతో, ఈ క్లీన్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్కు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇక అలాగే అదే రోజు విడుదలకావల్సిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాదికి షిఫ్ట్ కావడంతో బ్యాండ్ మేళం రిలీజ్ డేట్ మార్చాల్సివచ్చింది.
ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయికుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా .విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.సతీష్ జవ్వాజి డైరెక్ట్ చేస్తుండగా కోన వెంకట్ సమర్పణలో కావ్య -శ్రావ్య ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




































