మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకలు హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.అల్లు శిరీష్ వివాహం తన ప్రియురాలు నయనిక తో ఈ నెల మార్చి 6, 2026న కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరగనుందని తెలిసిందే. అందులో భాగంగా సోమవారం రాత్రి శిరీష్ – నయనికల ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో ఈ భారీ వేడుకను నిర్వహించారు. ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్ అగ్ర తారలు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, మోహన్ బాబు, నాని, నాగచైతన్య, రామ్ చరణ్, గోపీచంద్ తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. దర్శకులు అట్లీ, సుకుమార్, రాఘవేంద్రరావు కూడా సందడి చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రఘురామకృష్ణ రాజు వంటి పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడి వివాహ వేడుకలో అన్నీ తానై చూసుకున్నారు. అతిథులను స్వయంగా ఆహ్వానిస్తూ పెళ్లి సందడిలో చురుగ్గా పాల్గొన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























