నరేంద్ర మోదీని రిసెప్షన్‌కు ఆహ్వానించిన విరోష్ జోడీ

PM Narendra Modi Invited to Virosh Wedding Reception

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న (విరోష్) జోడీ స్వయంగా కలిసి తమ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్న అనంతరం, విజయ్ మరియు రష్మిక ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు.వారితో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వీరి వివాహ రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌లో ఘనంగా జరగనుంది.ఇక నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి విరోష్ జోడీ ఈ వేడుకకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఇక వీరి వివాహం అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య ఉదయ్‌పూర్‌లో ప్రైవేట్‌గా జరిగింది. అందుకే హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ మరియు రాజకీయ వర్గాల కోసం ఈ భారీ రిసెప్షన్‌ను ప్లాన్ చేశారు. విజయ్ -రష్మిక వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో సోషల్ మీడియాలో భారీ ఎత్తున్న విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.