గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ నుండి సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటల కోసం మెగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ మార్చి 2న విడుదల కాబోతోంది. ఇది రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అని సమాచారం.”రయ్ రయ్ రా రా” అంటూ సాగే ఈ పాటపై భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే విడుదలైన మొదటి పాట “చికిరి చికిరి” యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండవ పాట అంతకు మించి ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ముందుగా ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ పనులు పెండింగ్‌లో ఉండటంతో సినిమాను ఏప్రిల్ 30కి వాయిదా వేశారు.అయితే రీసెంట్ గా ఆ డేట్ కి కూడా రాకపోవచ్చు అని వార్తలు రాగ తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సెకండ్ సింగిల్ అప్డేట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో రిలీజ్ డేట్ ఏప్రిల్ 30 అనే ప్రకటించారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































