టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంట ఈరోజే రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వైభవంగా పెళ్లి చేసుకున్నారు.ఉదయపూర్‌లోని అత్యంత విలాసవంతమైన ‘ITC మెమెంటోస్’ రిసార్ట్‌లో వీరి వివాహం జరిగింది. ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఈ వేదికపై కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజు ఉదయం 10:10 గంటలకు తెలుగు సంప్రదాయం ప్రకారం ముహూర్తం జరిగింది. అనంతరం సాయంత్రం 4 గంటల నుండి రష్మిక వైపు ఆచారమైన కొడవ ( సంప్రదాయం ప్రకారం మరో వివాహ వేడుక జరగనుంది.
మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విజయ్ తల్లిదండ్రులకు ఒక ప్రత్యేక లేఖను పంపుతూ ఈ జంటకు తన ఆశీస్సులు అందజేశారు. సినిమా స్క్రిప్టుల కంటే నిజ జీవితంలో వారు రాసుకోబోయే ఈ కొత్త అధ్యాయం మరింత అర్థవంతంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ వేడుకకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్, హీరోయిన్లు ఈషా రెబ్బా, ఆషికా రంగనాథ్ వంటి అతికొద్ది మంది సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.
ఉదయపూర్‌లో ప్రైవేట్ వేడుక ముగిసిన తర్వాత, మార్చి 4న హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమలోని స్నేహితులు మరియు ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































