A&M మోషన్ క్యాప్చర్ ఫెసిలిటీని లాంచ్ చేసిన ఎస్‌.ఎస్‌ రాజమౌళి

S. S. Rajamouli Inaugurates A&M Motion Capture Studio

అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారతీయ సినీ పరిశ్రమకు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దేశంలో అత్యాధునిక మోషన్ క్యాప్చర్ సదుపాయాన్ని ఆవిష్కరిస్తూ, భారతీయ సినిమాల సృజనాత్మకతకు, సాంకేతికతకు కొత్త దిశను చూపింది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్, విజనరీ ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ స్థాపించిన మిహిరా విజువల్ ల్యాబ్స్ కలిసి ఏర్పాటు చేసిన ఈ ఫెసిలిటీకి A&M MoCap Lab అని పేరు పెట్టారు. హాలీవుడ్‌లో ప్రముఖ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ భాగస్వామి అయిన Animatrik Film Design ఈ ల్యాబ్‌కు సాంకేతిక శక్తిని అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫిబ్రవరి 20న ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చేతుల మీదుగా ఈ ఫెసిలిటీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోనాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తన కొత్త చిత్రం “వారణాసి”లో కీలక సన్నివేశాలను ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో చిత్రీకరించినట్టు ఆయన వెల్లడించారు. భారతీయ కథనాల స్థాయి, విజన్‌ను ఈ టెక్నాలజీ ఎలా మార్చబోతోందో కూడా వివరించారు.

ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారతదేశపు మొదటి డాల్బీ సినిమా ప్రాసెసింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన రాజమౌళి, ఈ మోషన్ క్యాప్చర్ ల్యాబ్ దేశీయ దర్శకులకు కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. “ఇప్పటివరకు ప్రపంచ స్థాయి టెక్నాలజీ కోసం విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. బాహుబలి, ఈగ వంటి సినిమాల సమయంలో ఈ సదుపాయం భారత్‌లో ఉంటే మరింత మెరుగ్గా తీర్చిదిద్దేవాళ్లమని అనిపిస్తోంది. ఇప్పుడు ఆ లోటు తీరింది,” అని చెప్పారు.

కింగ్ నాగార్జున అక్కినేని మాట్లాడుతూ,.. భారతీయ సినిమా ప్రయాణంలో ఇది ఒక కీలక ఘట్టం. “ప్రపంచ స్థాయి కథలను చెప్పాలనే కల భారతీయ దర్శకులకు ఎప్పటి నుంచో ఉంది. కానీ అత్యాధునిక సాంకేతిక వసతులు కొరతగా ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఈ సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల ఎపిక్ అడ్వెంచర్ నుంచి సైన్స్ ఫిక్షన్ డ్రామాల వరకు ఎన్నో కథలను సులభంగా తెరకెక్కించవచ్చు,”

శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. భారతీయ సినిమా ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే దేశంలోనే ఆధునిక టెక్నాలజీ వ్యవస్థలు అవసరం. “మిహిరా ల్యాబ్స్ లక్ష్యం ఎప్పుడూ ఫిల్మ్ మేకర్లకు అంతర్జాతీయ ప్రమాణాల టూల్స్ అందించడం. అన్నపూర్ణ స్టూడియోస్, Animatrikతో కలిసి ఈ లక్ష్యాన్ని నిజం చేయడం ఆనందంగా ఉంది

హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాలు “Avengers: Endgame”, “Spider-Man: No Way Home” వంటి చిత్రాల్లో పనిచేసిన Animatrik Film Design అధ్యక్షుడు & CTO బ్రెట్ ఇనెసన్ మాట్లాడుతూ,.. భారతీయ కథనాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి సాంకేతికతతో మరింత గొప్పగా రూపుదిద్దుకోనున్నాయి. “అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ మోషన్ క్యాప్చర్ సదుపాయం ప్రారంభం కావడం మా కోసం గర్వకారణం. ఇది భావోద్వేగపూరితమైన, విస్తృతమైన కథలను కొత్త స్థాయికి తీసుకెళ్తుంది.

A&M MoCap Lab ప్రారంభంతో భారతీయ సినిమాలు టెక్నాలజీ పరంగా మరో మెట్టు ఎక్కాయి. భవిష్యత్తులో ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, రియలిస్టిక్ క్యారెక్టర్స్‌తో భారతీయ కథలు మరింత గొప్పగా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.

అన్నపూర్ణ స్టూడియోస్ CTO సీవీ రావు ఈ ఫెసిలిటీని వెనుక ఉన్న సాంకేతిక సామర్థ్యం, గ్లోబల్ సహకారం గురించి వివరించారు.

“A&M మోషన్ క్యాప్చర్ ల్యాబ్‌లో 60 అడుగులు x 40 అడుగులు x 30 అడుగుల క్యాప్చర్ వాల్యూమ్ ఉంటుంది. ఇది హై-ప్రెసిషన్ ఆప్టికల్ ట్రాకింగ్, సబ్-మిల్లీమీటర్ అక్యురసీ, రియల్‌టైమ్ స్ట్రీమింగ్ టెక్నాలజీలను కలిపి, సెట్లో ఊహించిన విజన్‌ను ఫైనల్ ఎగ్జిక్యూషన్‌తో కలిపేలా చేస్తుంది. అలాగే ఈ వ్యవస్థ మాడ్యులర్ డిజైన్‌తో ఉండటం వల్ల అవసరానికి అనుగుణంగా విస్తరించుకోవచ్చు లేదా ఎక్కడైనా విడదీసి మళ్లీ అమర్చుకునే సౌలభ్యం ఉంది. ఈ స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ఫెసిలిటీ దర్శకులకు ప్రీ-విజువలైజేషన్ టూల్‌గా పనిచేస్తూ, షూటింగ్ ప్రారంభానికి ముందే క్రియేటివ్ విజన్‌ను ఖచ్చితంగా ప్లాన్ చేసుకునే అవకాశం ఇస్తుంది. దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు వర్చువల్ ఎన్విరాన్‌మెంట్‌లో కెమెరా బ్లాకింగ్, లెన్స్ ఎంపిక, కెమెరా మూవ్‌మెంట్స్, ఫ్రేమ్‌రేట్స్ వంటి అంశాలను ముందుగానే పరీక్షించవచ్చు. దీనివల్ల టెక్నికల్, లాజిస్టికల్ అవసరాలను ముందే అంచనా వేసి, లైవ్ షూట్‌లో సమయం, ఖర్చును తగ్గించుకోవచ్చు,” అని సీవీ రావు తెలిపారు.

ఈ సదుపాయంలో అత్యాధునిక Vicon Valkyrie (VK26) కెమెరాలు అమర్చబడ్డాయి. ఇవి క్లిష్టమైన పర్ఫార్మెన్స్ క్యాప్చర్ కోసం హై-ఫిడెలిటీ మోషన్ ట్రాకింగ్ అందిస్తాయి. రియల్‌టైమ్ డేటా స్ట్రీమింగ్ కోసం Vicon Live, అడ్వాన్స్‌డ్ పోస్ట్-ప్రాసెసింగ్ కోసం Vicon Post టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు.

రియల్‌టైమ్ విజువలైజేషన్, వర్చువల్ ప్రొడక్షన్ కోసం Unreal Engine లైవ్ ప్రివ్యూ ఇంటిగ్రేషన్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల నటులు, డిజిటల్ ఎన్విరాన్‌మెంట్ మధ్య వెంటనే ఇంటరాక్షన్ సాధ్యమవుతుంది. అలాగే హై-రెజల్యూషన్ ఫేషియల్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ కోసం స్టీరియో హెడ్-మౌంటెడ్ కెమెరా (HMC) యూనిట్స్ కూడా ఉన్నాయి. ఇవి సినిమాలు, గేమ్స్, ఇమర్సివ్ మీడియా ప్రొడక్షన్స్‌కు అనువుగా రూపొందించబడ్డాయి.

భారతీయ సినిమా రంగంలో 50 సంవత్సరాల లెగసీని పూర్తి చేసిన సమయంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ ఈ మోషన్ క్యాప్చర్ సదుపాయాన్ని ప్రారంభించడం విశేషం. భవిష్యత్తులో భారతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్స్, గేమ్ డెవలపర్స్, యానిమేషన్ స్టూడియోలతో కలిసి ప్రపంచ స్థాయి నాణ్యత, వేగంతో ప్రొడక్షన్ సేవలు అందించాలనే లక్ష్యంతో స్టూడియో ముందుకు సాగుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.