శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘భోగి’ ఫస్ట్ లుక్ విడుదలైంది. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత ఊర మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శర్వానంద్ చేతిలో ఒక పదునైన ఆయుధం పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ‘గంగ’ అని చిత్ర బృందం వెల్లడించింది. 1960ల నాటి ఉత్తర తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామంలో సాగే కథగా ఈ సినిమాను దర్శకుడు అత్యంత క్రూరంగా, సహజంగా తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 28, 2026 న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు. నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ విడుదలైన వారం తర్వాతే ఈ ‘భోగి’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. అనుపమ పరమేశ్వరన్ మరియు డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























