జీవి ప్రకాష్ ప్రధాన పాత్రలో సంగీత నేపథ్యంలో తెరకెక్కిన కొత్త సినిమా సర్వం తాళ మయం. మెరుపు కలలు, ప్రియురాలు పిలిచింది వంటి క్లాసిక్ మూవీస్ ను అందించిన రాజీవ్ మీనన్.. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ సినిమా తమిళంలో రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకోగా.. తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక తెలుగులో కూడా ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… శంకరాభరణం, సాగర సంగమం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రాజీవ్ మీనన్ రూపొందించిన ‘సర్వం తాళ మయం’ చిత్రాన్ని చూసిన కె. విశ్వనాథ్ గారు “చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను… రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు.. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్ కి నా ఆశీర్వాదాలు.” అని అభినందించి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
అలాగే ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, మహానటి దర్శకులు నాగ అశ్విన్, యాత్ర దర్శకులు మహి వీ రాఘవ్ ఈ చిత్రాన్ని చూసి రాజీవ్ మీనన్ ని ఎంతగానో ప్రశంసించారు. ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మార్చి 8 న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం అన్ని మల్టి ప్లెక్స్ ధియేటర్లలోనూ విడుదల చేస్తున్నట్టు రాజీవ్ మీనన్ తెలిపారు.
కాగా ఈ సినిమాలో జీవి ప్రకాష్ సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించింది. ఇంకా ఈ సినిమాలో నేడుముడి వేణు, వినీత్, దివ్య దర్శిని ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. మరి తమిళ్ లో మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈసినిమా తెలుగులో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.
[youtube_video videoid=7zkl9XDCdFk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























