శర్వానంద్ హీరోగా UV క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘బైకర్’ విడుదలపై చిత్ర యూనిట్ పూర్తి స్పష్టతనిచ్చింది. ఈ సినిమా ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 3, 2026న పక్కాగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ , ఓటీటీ డీల్ క్లోజ్ కావడంతో సినిమా ప్రమోషన్స్ మరియు విడుదల తేదీ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో ఇండస్ట్రీలో కొన్ని ఊహాగానాలు వచ్చినప్పటికీ, సమ్మర్ సీజన్‌ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఏప్రిల్ మొదటి వారానికే మేకర్స్ మొగ్గు చూపారు. ఈ సినిమా భారతదేశపు మొదటి మోటోక్రాస్ రేసింగ్ డ్రామాగా వస్తుండటం, శర్వానంద్‌తో పాటు సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తుండటం సినిమాపై భారీ అంచనాలను పెంచింది. అభిలాష్ రెడ్డి కంకరా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.
సినిమా కూడా బాగా వచ్చిందని ఇండస్ట్రీ సరిల్క్ లో మంచి టాక్ వినిపిస్తుంది.సో ఈసినిమా తో శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ చూడనున్నాడు. ఈఏడాది సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు శర్వానంద్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























