యంగ్ హీరో హవీష్, బ్లాక్ బస్టర్ దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’ షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ‘సినిమా చూపిస్త మామ’,’నేను లోకల్’, ‘ధమాకా’ వంటి భారీ విజయాలను అందించిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో హవీష్ సరసన కావ్యా థాపర్ కథానాయికగా నటించగా వీరితో పాటు టాలీవుడ్‌లోని ప్రముఖ హాస్య నటులైన శ్రీలక్ష్మి, వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్, మురళీ శర్మ, గోపరాజు రమణ, హరితేజ మరియు రోహిణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు పోస్టర్లు మంచి రెస్పాన్స్‌ను అందుకున్నాయి. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, సుమారు రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వించి, చివరి 15 నిమిషాల్లో చక్కటి ఎమోషన్‌ను పండించే విధంగా ఉంటుందని హీరో హవీష్ పేర్కొన్నారు.
నిర్మాతలు ఈ చిత్రాన్ని 2026 వేసవి కానుకగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























