NC 25కోసం క్రేజీ కాంబినేషన్

Exciting Combination Set for NC 25

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో 25వ సినిమా (NC25) అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలవబోతోంది. తన కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన ఈ సినిమా కోసం చైతన్య ఒక క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక బ్లాక్‌బస్టర్ దర్శకుడు సిద్ధం చేసిన అద్భుతమైన స్క్రిప్ట్‌పై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే అక్కినేని అభిమానులకు ఇది ఒక భారీ విందుగా మారడమే కాకుండా, చైతన్య కెరీర్‌లోనే ఒక మెమరబుల్ చిత్రంగా మిగిలిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మైలురాయి చిత్రం కోసం చైతన్య గత సినిమాల కంటే భిన్నమైన జోనర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందనున్న ఈ సినిమాను టాలీవుడ్‌లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం నాగచైతన్య వృషకర్మ పూర్తి చేసే పనిలో వున్నాడు.అది పూర్తయిన వెంటనే తన 25వ సినిమాపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. వైవిధ్యమైన కథ, మరోవైపు మాస్ ఎలిమెంట్స్ కలగలిసిన ఈ స్క్రిప్ట్ చైతన్య ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు.

ఇక వృషకర్మ షూటింగ్ తుది దశకు చేరుకుంది. అయితే హెవీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండడం తో సినిమా ఈఏడాది ద్వితీయార్థంలో విడుదలకానుంది.విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు ఈసినిమాను తెరకెక్కిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.భారీ బడ్జెట్ తో భోగవల్లి ప్రసాద్, సుకుమార్ , ఇషాన్ సక్సేనా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.