కపుల్ ఫ్రెండ్లీ 3 డేస్ కలెక్షన్స్

Couple Friendly Posts Impressive 3-Day Collections

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి వారాంతాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ₹5.42 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాజిటివ్ టాక్ రావడంతో రోజురోజుకూ వసూళ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మొదటి రోజు కంటే రెండవ మరియు మూడవ రోజు కలెక్షన్స్ మెరుగుపడటం విశేషం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో మల్టీప్లెక్స్‌లు మరియు నైట్ షోలకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సుమారు ₹10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, మొదటి మూడు రోజుల్లోనే సగం కంటే ఎక్కువ పెట్టుబడిని వెనక్కి రాబట్టింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే సుమారు ₹5 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. ట్రెండ్ చూస్తుంటే ఈ వారం లోపే ఆ మార్కును చేరుకునే అవకాశం ఉంది.సహజమైన నటన, మెచ్యూర్డ్ లవ్ స్టోరీ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా వైపు మొగ్గు చూపుతున్నారు.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడం కూడా కపుల్ ఫ్రెండ్లీకి అడ్వాంటేజ్ అవుతుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.