అల్లు అర్జున్ కి క్షమాపణలు చెప్పిన కావేరి బరూవా

Kaveri Barua Issues Apology to Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై తాను చేసిన వ్యాఖ్యలను ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరూవా వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు.ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కావేరి బరూవా, అల్లు అర్జున్‌ను కలవాలంటే ఆయన టీమ్ 42 నిబంధనలతో కూడిన ఒక జాబితాను ఇస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో “ఆయన కళ్ళలోకి చూడకూడదు, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు” వంటి కఠినమైన రూల్స్ ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యి, అల్లు అర్జున్ ప్రతిష్టకు భంగం కలిగించేలా మారాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ టీమ్ వెంటనే స్పందించింది. ఆమె చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని, పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఖండించడమే కాకుండా, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అల్లు అర్జున్ టీమ్ సీరియస్ అవ్వడంతో కావేరి బరూవా తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ బహిరంగ క్షమాపణ చెప్పారు. అల్లు అర్జున్ కానీ, ఆయన టీమ్ కానీ తనకు ఎటువంటి 42 నిబంధనల డాక్యుమెంట్‌ను ఇవ్వలేదని ఆమె అంగీకరించారు.

పాడ్‌కాస్ట్ సంభాషణలో భాగంగా అనుకోకుండా ఆ మాటలు దొర్లాయని, అవి వాస్తవాలు కావని తెలిపారు.తన నిరాధారమైన వ్యాఖ్యల వల్ల అల్లు అర్జున్ ప్రతిష్టకు భంగం వాటిల్లినందుకు విచారం వ్యక్తం చేస్తూ, ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

అల్లు అర్జున్ మరియు ఆయన పని పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని ఆమె పేర్కొన్నారు.ఈ వివాదంపై పాడ్‌కాస్ట్ నిర్వాహకులు కూడా స్పందిస్తూ, సదరు వీడియోను తమ ప్లాట్‌ఫారమ్స్ నుండి తొలగించినట్లు వెల్లడించారు. కావేరి బరూవా క్షమాపణలతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లే.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.