టాలీవుడ్ యంగ్ పెయిర్ హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘బ్యాండ్ మేళం’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ వాలెంటైన్స్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్లింప్స్‌లో హీరో తన ప్రేమను వ్యక్తపరుస్తూ చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా హత్తుకుంటున్నాయి. రొమాంటిక్ టోన్‌తో పాటు బలమైన భావోద్వేగ సన్నివేశాలు ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. గతంలో ‘కోర్ట్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట, మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది.
హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీగా వస్తున్న ఈసినిమాను కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్యలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం మార్చి 13, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
యువతను ఆకట్టుకునే రొమాన్స్‌తో పాటు హృదయాన్ని తాకే ఎమోషనల్ కంటెంట్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా వచ్చిన ఈ గ్లింప్స్ మార్చి విడుదలకి ముందు మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































