శైలేష్ కొలను – రోషన్ మేక మూవీ టైటిల్ ఏమో ఏమో ఇది : ఫస్ట్ బ్రీజ్ రిలీజ్

The First Breeze of Emo Emo Idi out now

టాలీవుడ్ యువ నటుడు రోషన్ మేకా మరియు క్రేజీ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాకు ‘ఏమో ఏమో ఇది’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో (The First Breeze) నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ అనౌన్స్‌మెంట్ వీడియో చాలా ఫన్నీగా, నేటి తరం యువత డేటింగ్ సంస్కృతిపై వ్యంగ్యంగా సాగింది.అభయ్ (రోషన్) తన మథర్ తో కాఫీ షాప్‌లో కూర్చుని ‘బెంచింగ్’, ‘గోస్టింగ్’, ‘సిచువేషన్ షిప్’ వంటి ఆధునిక ప్రేమ పదాల గురించి చర్చించడం నవ్వులు పూయిస్తుంది. అమ్మాయిలు అబ్బాయిలను ఎలా వెయిటింగ్ లిస్ట్‌లో పెడుతున్నారో రోషన్ తనదైన శైలిలో వివరించడం చూస్తుంటే, ఈ సినిమా ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ అని అర్థమవుతోంది. ‘మైఖేల్ సి. విలియమ్స్’ వంటి పీరియడ్ రోల్ తర్వాత రోషన్ ఒక మోడ్రన్ అబ్బాయిగా కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది. వీడియో చివరలో ఆమెను చూసి రోషన్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే “ఏమో ఏమో ఇది…” అనే మ్యూజిక్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉన్నాయి. హిట్ సిరీస్ , సైంధవ్ వంటి సీరియస్ సినిమాల తర్వాత శైలేష్ కొలను మొదటిసారి ఒక పూర్తిస్థాయి లవ్ స్టోరీని డీల్ చేస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈసినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.