మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’ . మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది .ఇక ఈ సంబంధించి రేపు ఓ అప్డేట్ రానుంది. అదేంటంటే ఇందులో హీరోయిన్ ను పరిచయం చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సినిమాలో కథానాయికగా కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ నటిస్తుందని లీక్ అయిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు ఈ చిత్రంలో రవితేజ కుమార్తె పాత్ర చాలా కీలకం. ఈ ముఖ్యమైన పాత్ర కోసం బేబీ నక్షత్ర ను ఎంపిక చేశారు. సినిమాలో తండ్రీకూతుళ్ల మధ్య సాగే భావోద్వేగపూరితమైన సన్నివేశాలు హైలైట్‌గా నిలవనున్నాయి. అలాగే మరో ముఖ్యమైన పాత్రలో నటి స్వాసిక మరియు సీనియర్ నటుడు సాయి కుమార్ కనిపించబోతున్నారు.
దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రంలో ప్రతి పాత్రను చాలా వినూత్నంగా డిజైన్ చేశారని, ముఖ్యంగా రవితేజను మునుపెన్నడూ చూడని విధంగా అయ్యప్ప మాలధారణలో ఆధ్యాత్మిక కోణంలో చూపించబోతున్నారని సమాచారం. శబరిమల యాత్ర నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

























