రామ్ చరణ్ – ఉపాసన వారసుల పేర్లు రివీల్ 

Ram Charan–Upasana Announce Their Twins’ Names

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గత నెల జనవరి 31న కవలలు (ఒక బాబు, ఒక పాప) జన్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిన్నారుల బారసాల వేడుకను ఫిబ్రవరి 11న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఎంతో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ముద్దుల బిడ్డల పేర్లను అధికారికంగా వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ చరణ్ తన కుమారుడికి ‘శివరామ్’ అని, కుమార్తెకు ‘అన్వీరా దేవి’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ పేర్ల వెనుక ఉన్న విశిష్టతను కూడా ఆయన వివరించారు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు (శివశంకర వరప్రసాద్) లోని ‘శివ’ మరియు భగవంతుడైన ‘రాముడి’ పేర్లు కలిసి వచ్చేలా బాబుకు ‘శివరామ్’ అని పేరు పెట్టినట్లు చెప్పారు. ఇక కుమార్తె పేరు ‘అన్వీరా దేవి’లో ‘అన్’ అంటే అపరిమితమైన అని, ‘వీర’ అంటే ధైర్యం అని అర్థం. అంటే అపరిమితమైన ధైర్యం, దైవిక శక్తి కలిగిన అమ్మాయి అనే అర్థం వచ్చేలా ఈ పేరును ఎంచుకున్నట్లు చరణ్ పేర్కొన్నారు.

క్లీంకార జన్మించిన తర్వాత, ఇప్పుడు ఈ కవలల రాకతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపు అయింది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడికి తండ్రి కావడం పట్ల చరణ్ తన కృతజ్ఞతను చాటుకున్నారు. తమ జీవితంలో మహిళలే నిజమైన బలమని, ఎప్పుడూ అండగా ఉండే అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.