రివ్యూ : ఫంకీ

funky review in telugu

నటీనటులు : విశ్వక్ సేన్ , కయాదు లోహార్ , నరేష్ ,వీటీవీ గణేష్
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : సురేష్ సారంగం
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
దర్శకత్వం : అనుదీప్ కేవీ
నిర్మాత : నాగవంశీ, సాయి సౌజన్య

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విశ్వక్ సేన్ హీరోగా, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఫంకీ. విడుదలకు ముందు సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక ఈసినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ‘ వాలెంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మరియు టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ : కోమల్ (విశ్వక్ సేన్) అనే ఒక స్ట్రగ్లింగ్ సినిమా డైరెక్టర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతను తక్కువ బడ్జెట్‌లో ఒక సినిమా తీయాలనుకుంటాడు. ఆ క్రమంలో నిర్మాత సుదర్శన్ (నరేష్) ఆరోగ్యం పాడవ్వడంతో, ఆయన కూతురు చిత్ర (కయాదు లోహార్) బాధ్యతలు చేపట్టి డైరెక్టర్‌ను మార్చాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? కోమల్ తన సినిమాను ఎలా పూర్తి చేశాడు? చిత్రను ఎలా ఇంప్రెస్ చేశాడు? అనేదే మిగిలిన సినిమా.

దర్శకుడు అనుదీప్ తన మార్కు వన్-లైనర్ కామెడీ మరియు సిల్లీ జోక్స్‌తో సినిమాను నడిపించే ప్రయత్నం చేశారు.ఇందులో దాదాపు గా సక్సెస్ అయ్యాడు. చాలా చోట్ల కామెడీ బాగానే పండింది. కథలో బలమైన ఎమోషన్స్ లేదా లాజిక్స్ ఆశించే వారికి ఈ సినిమా కొంత నిరాశ కలిగించవచ్చు.

ప్రధమార్ధం :
సినిమా ప్రారంభం చాలా సరదాగా, వినోదాత్మకంగా ఉంటుంది. విశ్వక్ సేన్ ఒక స్ట్రగ్లింగ్ డైరెక్టర్‌గా పడే పాట్లు, ఆయన టీమ్ మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ముఖ్యంగా అనుదీప్ కేవీ మార్కు వింతైన మేనరిజమ్స్, సిల్లీ వన్ లైనర్స్ ప్రధమార్ధంలో బాగా పేలాయి. ఇంటర్వెల్ వరకు కథనం చాలా వేగంగా, ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది.

ద్వితీయార్ధం :
సెకండాఫ్‌లో సినిమా మేకింగ్ ప్రాసెస్ మరియు షూటింగ్ సెట్స్‌లో జరిగే గందరగోళం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కోమల్ మరియు చిత్ర మధ్య సాగే సీన్స్ రిఫ్రెషింగ్‌గా ఉంటాయి. సినిమా క్లైమాక్స్‌కు ముందు వచ్చే కొన్ని సర్ప్రైజ్ క్యామియోలు థియేటర్లో సందడిని పెంచుతాయి. కామెడీతో పాటు చివర్లో చిన్నపాటి హృదయానికి హత్తుకునే ముగింపు ఇవ్వడం బాగుంది.

నటీనటుల పెర్ఫామెన్స్ :

నటీనటుల పరంగా విశ్వక్ సేన్ తన మాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, సాఫ్ట్ అండ్ కామెడీ రోల్‌లో మెప్పించారు.కోమల్ పాత్రలో చాలా సెటిల్డ్ గా చేశారు. కయాదు లోహార్ తన గ్లామర్‌తో ఆకట్టుకోగా, నరేష్ మరియు వీటీవీ గణేష్ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. సినిమాలో దిల్ రాజు, నాగవంశీ వంటి ప్రముఖులు అతిథి పాత్రల్లో కనిపించడం విశేషం.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ కూడా సినిమా మెప్పిస్తుంది. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా బాగున్నాయి.ఎడిటింగ్ విషయంలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోని ఉంటే బాగుండేది. 2 గంటల 8 నిమిషాల నిడివి సినిమాకు పెద్ద అడ్వాంటేజ్. విజువల్‌గా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది.నిర్మాతలు తక్కువ బడ్జెట్‌లో అయినా మంచి క్వాలిటీతో సినిమాను నిర్మించారు.

మొత్తానికి, ‘ఫంకీ’ ఒక కంప్లీట్ స్ట్రెస్ బస్టర్ అని చెప్పవచ్చు. కుటుంబం మరియు స్నేహితులతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఈ వారాంతం ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.