ఫైనల్ షెడ్యూల్ లో జెట్ లీ

Jet Lee's Final Shooting Schedule Underway

రితేష్ రాణా దర్శకత్వంలో సత్య హీరోగా నటిస్తున్న వినూత్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘జెట్ లీ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కాగా అప్పుడే చివరి షెడ్యూల్ లోకి ఎంట్రీ ఇచ్చింది.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో సాగుతోంది. చిత్ర బృందం వెల్లడించిన ప్రకారం, ఇప్పుడు జరుగుతున్న షెడ్యూలే చివరి షెడ్యూల్. దీని తర్వాత మరో షెడ్యూల్ ఉండదు అని సెట్ లో హీరో , డైరెక్టర్ మధ్య జరిగిన సరదా సంభాషణ వీడియో ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘మత్తు వదలరా’ సిరీస్‌తో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న రితేష్ రాణా, ఈసారి ‘జెట్ లీ’తో ప్రేక్షకులకు సరికొత్త ‘టర్బులెన్స్’ (అలజడి) చూపించబోతున్నారు. ఇందులో సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో పాటు, టైటిల్‌కు తగ్గట్లుగా మార్షల్ ఆర్ట్స్ మరియు యాక్షన్ అంశాలతో అలరించనున్నారు.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై మంచి అంచనాలను పెంచింది. సత్య మార్కు వినోదంతో పాటు యాక్షన్ ప్యాక్డ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.షూటింగ్ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుని సమ్మర్ లో సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.