స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా NBK 111

NBK 111 Shaping Up as a Stylish Action Entertainer

నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK 111’ సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముందుగా ఈ సినిమాను ఒక చారిత్రక నేపథ్యం ఉన్న కథగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని భావించారు. అయితే, బడ్జెట్ పరిమితులు మరియు ఇతర సాంకేతిక కారణాల వల్ల ఇప్పుడు ఆ కథను పూర్తిగా మార్చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ముంబై మాఫియా నేపథ్యంలో సాగే ఒక స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. బాలయ్యను మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ మాఫియా డాన్ అవతారంలో చూపించేందుకు గోపీచంద్ మలినేని స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. గత చిత్రాల మాదిరిగా డబుల్ రోల్స్ కాకుండా, ఈ సినిమాలో బాలకృష్ణ ఒకే పాత్రలో కనిపించనున్నారట.

ఇది అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. బాలయ్యకు లక్కీ హీరోయిన్‌గా పేరున్న నయనతార ఈ సినిమాలో కథానాయకగా నటించనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం.వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి తొలి వారం నుండి ప్రారంభం కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.