ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’ విడుదల తేదీపై ఎట్టకేలకూ క్లారిటీ వచ్చేసింది. వారణాసి నగరంలో వెలిసిన వినూత్నమైన హోర్డింగ్‌ల ద్వారా ఈ భారీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ నిన్నటి సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వారణాసి నగరంలోని ప్రధాన కూడళ్లలో ఎటువంటి లోగోలు లేదా నటీనటుల ఫోటోలు లేకుండా, కేవలం “ఏప్రిల్ 7, 2027 – థియేటర్లలో” అని ఉన్న భారీ హోర్డింగ్‌లు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.ఇది వారణాసి విడుదల తేదీనే అని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు.దాంతో ఈ రిలీజ్ డేట్ ట్రెండింగ్ లోకి వచ్చింది.ఇక వారణాసి టీం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.ఈరోజు కొత్త పోస్టర్ తో రిలీజ్ డేట్ చెప్పేశారు.
రాజమౌళి తనదైన శైలిలో ఈ వినూత్న మార్కెటింగ్ స్ట్రాటజీతో రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ తేదీ ఉగాది పండుగతో పాటు వరుసగా వచ్చే సెలవులకు (అంబేద్కర్ జయంతి, శ్రీరామనవమి) కలిసొచ్చేలా ప్లాన్ చేశారు.
ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే సాహసికుడి పాత్రలో కనిపిస్తుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.
ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా సుమారు 1000 నుండి 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. రాజమౌళి మార్క్ మేకింగ్‌తో రాబోతున్న ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























