బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో సెన్సేషన్ సృష్టించిన రణ్‌వీర్ సింగ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ ఇప్పుడు డిజిటల్ సందడికి సిద్ధమైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ చిత్రం ఈరోజు అర్ధరాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేక్షకులకు హోమ్ థియేటర్ అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని 4K రిజల్యూషన్ మరియు డాల్బీ డిజిటల్ 5.1 ఆడియో క్వాలిటీతో అందుబాటులోకి తెచ్చారు. ఈసినిమా ఓటీటీలో హిందీతోపాటు తెలుగు , తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. అయితే థియేటర్లలో మాత్రం కేవలం హిందీ లో మాత్రమే విడుదలై ప్రపంచ వ్యాప్తంగా 1300కోట్ల వసూళ్లతో సెన్సేషన్ సృష్టించింది.
రణ్‌వీర్ సింగ్ ఇందులో ‘రా’ (RAW) ఏజెంట్‌గా పవర్‌ఫుల్ నటనను కనబరచగా, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో మెరిశారు.
పాకిస్థాన్‌లోని ప్రమాదకరమైన ల్యారీ ప్రాంతంలో సాగే అండర్ కవర్ ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ధురంధర్ 2’ కూడా రూపొందుతోంది. అది మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























