దసరా టార్గెట్ గా ప్రభాస్ ఫౌజీ

Prabhas’ Fauji Aims for Dussehra Release

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ గురించి మరిన్ని ఎగ్జైటింగ్ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ మరియు విడుదల విషయంలో చిత్ర యూనిట్ అత్యంత పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నారు. షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు తన డేట్స్‌ను పూర్తిగా ఫౌజీ సినిమాకే కేటాయించినట్లు సమాచారం. ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా సింగిల్ షెడ్యూల్‌లో తన భాగాన్ని పూర్తి చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారు.

ఈ భారీ చిత్రాన్ని 2026 దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నద్ధమవుతున్నారు. పండుగ సీజన్ కావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సినిమా విజువల్స్ మరియు టెక్నికల్ అంశాలు ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉండబోతున్నాయి. 1940ల నాటి సెట్టింగ్స్, యుద్ధ సన్నివేశాలు మరియు అత్యున్నత స్థాయి గ్రాఫిక్స్‌తో సినిమాను ఒక విజువల్ ఫీస్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు.

సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమా గ్రాండియర్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చాయి.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ సోల్జర్ పాత్రలో కనిపించబోతున్నారు.ఇందులో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తుంది. తనకు ఇదే మొదటి సినిమా.

మరోవైపు ప్రభాస్ ,స్పిరిట్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా ఈసినిమాను తెరకెక్కిస్తుండగా భారీ బడ్జెట్ తో టీ సిరీస్ , భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. ఈఏడాది షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.