రేంజ్ రోవర్ రే గిఫ్ట్ గా ఇచ్చేశారు – అనిల్ రావిపూడి

Chiranjeevi Rewards Anil Ravipudi with a Range Rover for Mana Shankaravara Prasad Garu Success

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ల ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (రీజనల్ ఫిల్మ్స్) సెలబ్రేషన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో సినిమా యూనిట్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కి షీల్డ్స్ అందించారు. దర్శకులు కె రాఘవేంద్రరావు, వివి వినాయక్, నిర్మాత దిల్ రాజు, సుప్రియ యార్లగడ్డ పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మరో అదిరిపోయే సంక్రాంతి, ఇరగదీసే సంక్రాంతి ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ. లాస్ట్ ఇయర్ విక్టరీ వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం లాంటి విజయాన్ని ఇచ్చారు.ఇప్పుడు చిరంజీవి గారితో మరో అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. వరుసగా తొమ్మిది విజయాలు అంటే నాకు టెన్షన్ మొదలైంది( నవ్వుతూ) ప్రతి సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా జర్నీలో నాకు ఎంతో సపోర్ట్ చేసిన మా నిర్మాతలు సుస్మిత గారికి సాహు గారికి థాంక్యూ. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. ఈ సినిమా జరుగుతున్న సమయంలో నేను మీకు మంచి హిట్ ఇస్తే నాకు ఏమి ఇస్తారు అని సరదాగా చిరంజీవి గారిని అడుగుతుండేవాడిని. ఈరోజు ఇంటికి పిలిచి నేను ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఆయన ఒక రేంజ్ లో గిఫ్ట్ ఇస్తారు అనుకున్నాను కానీ రేంజ్ రోవర్ రే గిఫ్ట్ గా ఇచ్చేశారు. ఇది గిఫ్ట్ గా కంటే నా మీద ఆయనకున్న ప్రేమగా చూస్తున్నాను. ఆ ప్రేమని వెలకట్టలేను. మా వెంకటేష్ గారికి స్పెషల్ స్పెషల్ థాంక్స్. ఆయనకి నా మీద ఉన్న ప్రేమ చిరంజీవి గారి మీద ఉన్న గౌరవం మాటల్లో చెప్పలేనిది. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఈవెంట్లో ఆయన మాతోపాటు ఉన్నారు. ఈ సక్సెస్ ని మా కంటే ఆయన ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనిపించింది.

ఇది మెగా ఉత్సవం, విక్టరీ విన్యాసం, రికార్డుల విధ్వంసం, డిస్ట్రిబ్యూటర్ల మహదానందం, ప్రొడ్యూసర్ల మనోధైర్యం ధనాధన్(నవ్వుతూ) చిరంజీవి గారి కోసం రికార్డులన్నీ మమ్మల్ని దత్తత తీసుకోండి సార్ అంటున్నాయి. గిన్నిస్ బుక్ ఆ హుక్ స్టెప్పు పంపుతారా అని అడుగుతోంది సినిమాలో ఉన్న చాలా విషయాలు ఆయనకి సరిగ్గా సరిపోతాయి. గుంటూరు నుంచి వైజాగ్ వరకు ఒక జర్నీ చేశాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సినిమాని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక జాతర లాగా చూశారు. చిరంజీవి గారిని అభిమాని అభిమానించే ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. చిరంజీవి గారితో ఈ సినిమా జర్నీ నాకు ఎన్నో అద్భుతమైన ఎమోషన్స్ ని ఇచ్చింది. ఈ ఆనందాన్ని మళ్లీ పొందడానికి ఆయనతో మరో సినిమా చేయాలనిపిస్తుంది. ఈ సినిమాలో అందరికీ ఆయన ఓటీపీ ఇచ్చారు. ప్రేక్షకులు ఏటీపీ (ఆల్ టైం ప్రభంజనం) ఇచ్చారు. సంక్రాంతి బరిలో ఇది మామూలు మోత మోగలేదు. ఇలాంటి ఎన్నో ఆల్ టైం ప్రభంజనాలు ఆయన మరిన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిరు జర్నీని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఇది మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.