ఆసక్తికరంగా RT 77 టైటిల్ .. ఫస్ట్ లుక్ రిలీజ్

RT 77 Title Irumudi Revealed Along with First Look

మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు (జనవరి 26, 2026) మరియు రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ దక్కింది. రవితేజ తన 77వ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి చిత్రాలను అందించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకు ‘ఇరుముడి’ అనే పవర్‌ఫుల్ మరియు ఆధ్యాత్మికం కలగలిసిన టైటిల్‌ను ఖరారు చేశారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రవితేజ అయ్యప్ప స్వామి మాలధారణలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. భక్తుల కోలాహలం మధ్య ఒక చిన్న పాపను భుజంపై ఎత్తుకుని, చిరునవ్వుతో కనిపిస్తున్న రవితేజ లుక్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా రవితేజ స్పందిస్తూ.. “కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి ఒక గొప్ప కథలో భాగమైనందుకు సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు. తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే బలమైన ఎమోషన్ మరియు భక్తి నేపథ్యంతో ఈ సినిమా సాగనుందని సమాచారం.

ఇక ఈ ఫస్ట్ లుక్ & టైటిల్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తుంది. రవితేజ ఎప్పుడు లేని విధంగా ఆధ్యాత్మిక రోల్ లో కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈసినిమాతో రవితేజ కం బ్యాక్ అవుతారని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.