‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్న నిహారిక కొణిదెల, ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై తన తదుపరి చిత్రం ‘రాకాస’ను నిర్మిస్తున్నారు. సంగీత్ శోభన్ కథానాయకుడిగా మాసన శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ గ్లింప్స్ ప్రారంభంలో “యుగయుగాలుగా ప్రతీ కథలో ఓ సమస్య. ఆ సమస్యను ఛేదించేందుకు ఓ వీరుడు పుడతాడు. తానెవరో తెలిసేలోపే నిశ్శబ్దంగా పని ముగిస్తాడు. ఈ కథలో ఆ వీరుడ్ని నేనే..” అంటూ సంగీత్ శోభన్ వాయిస్‌తో ఎంతో గంభీరంగా మొదలవుతుంది. అయితే, వెనువెంటనే అది కామెడీ మరియు సెటైరికల్ టర్న్ తీసుకోవడం ప్రేక్షకులను నవ్విస్తోంది. సంగీత్ శోభన్ తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకున్నారు.
నయన్ సారిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు ఉమేష్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ‘మ్యాడ్’ మరియు ‘ప్రేమలు’ వంటి సినిమాల తర్వాత సంగీత్ శోభన్ చేస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ పై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























