ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో శర్వానంద్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈసినిమాను నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.మరో హీరో శ్రీ విష్ణు క్యామియో రోల్ లో మెరిశాడు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసందర్బంగా ప్రొడ్యూసర్ అనిల్ సంకర మాట్లాడుతూ… అందరికి నమస్కారం. సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ అప్పుడు ఈ షీల్డ్స్ ఇచ్చాము. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ సక్సెస్ కి షీల్డ్స్ ఇవ్వడమనేది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇది అందరూ మెచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రశంసలు అందుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.శర్వా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మొదటి నుంచి నమ్మకంగా చెప్పారు. ఆ నమ్మకం నిజమైంది. నెక్స్ట్ సంక్రాంతికి ఆయన మళ్లీ వస్తున్నారు. ఆయన రావాలని అందరు కోరుకుంటున్నారు. ఎందుకంటే శర్వా వస్తే ప్రతి సినిమా హిట్ అయిపోతుంది.రైటర్స్ భాను నందు మా జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.
నరేష్ గారు ఈ సినిమా సామజవరగమన కంటే పెద్ద హిట్ అవుతుంది అని చెప్పారు. ఆయన సీన్స్ కి థియేటర్స్ లో పడి పడి నవ్వుతున్నారు. మా డిస్టిబ్యూటర్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. యుఎస్ లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విష్ణు కామియో అద్భుతంగా చేశారు. తన డైలాగులకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ రామ్ తో మళ్లీ చేస్తున్నాం. ఎప్పుడనేది త్వరలోనే చెప్తాం. ఏకే ఎంటర్టైన్మెంట్ టీం నాకు ఎంతో సపోర్ట్ చేశారు . ఈ సినిమా విజయం మా టీం కి అంకితం చేస్తున్నాను. సంక్రాంతి విన్నర్ అని చెప్పడానికి కారణం ఉంది థియేటర్స్ కి వెళ్తే నీకే తెలిసిపోతుంది. ఏ సినిమా అయితే ప్రేక్షకుల్ని ఆనందాన్ని ఇస్తాయో ఆ సినిమాలన్నీ కూడా విన్నర్స్. ప్రతి సంక్రాంతి ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విజయంతో మరింత బాధ్యత పెంచుకుని నెక్స్ట్ వచ్చే సినిమా ఇంతకంటే బెటర్ గా ఉండాలని కోరుకుంటున్నాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























