లవ్ స్టోరీ మరోసారి థియేటర్లలోకి

Love Story Hits Theatres Again

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘లవ్ స్టోరీ’ (2021) మళ్లీ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14, 2026న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “నా హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రం ‘లవ్ స్టోరీ’ మళ్లీ ఫిబ్రవరి 14న విడుదలవుతోంది. మీ అందరితో కలిసి థియేటర్లలో మళ్లీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని రాసుకొచ్చారు.

రేవంత్, మౌనిక పాత్రల మధ్య సాగే స్వచ్ఛమైన ప్రేమకథ, తెలంగాణ నేపథ్యం మరియు పవన్ సిహెచ్ అందించిన అద్భుతమైన సంగీతం ఈ సినిమాను అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిపాయి. ముఖ్యంగా ‘సారంగ దరియా’ పాట అప్పట్లో ఒక ఊపు ఊపేసింది.ఇక ప్రేమికుల రోజున మరోసారి రేవంత్, మౌనికల మ్యాజిక్ పెద్ద తెరపై చూడటం లవర్స్ కి ఒక మంచి అనుభూతిని ఇవ్వనుంది.నారాయణ దాస్ నారంగ్ , పుస్కూర్ రామ్ మోహన్ ఈసినిమాను నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.