పవన్ కళ్యాణ్ తో మూవీ పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి 

The Title of My Next Film Will Be Different and Interesting says Anil Ravipudi

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి విలేకరులతో ముచ్చటిస్తూ తన తదుపరి చిత్రం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తర్వాతి సినిమా కూడా 200 శాతం పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే పవన్ కళ్యాణ్‌తో సినిమా గురించి వస్తున్న వార్తలపై అనిల్ స్పందిస్తూ, పవన్ కళ్యాణ్‌ను తాను నేరుగా కలవలేదని తెలిపారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉన్నారని, ఒకవేళ భవిష్యత్తులో కాంబినేషన్ కుదిరితే తప్పకుండా చేస్తానని చెప్పారు. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్‌తో సినిమా గురించి ఎలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం ఒక విచిత్రమైన టైటిల్‌ను అనుకుంటున్నానని, ఆ టైటిల్ వింటేనే ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని ఆయన పేర్కొన్నారు.

జూన్ లేదా జూలై నాటికి ఈ కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టోరీ లైన్ మాత్రమే ఫిక్స్ అయ్యిందని, నటీనటుల డేట్స్‌ను బట్టి కాస్టింగ్ ఖరారు చేస్తామని అనిల్ వెల్లడించారు. ప్రయోగాలు చేయడం కంటే ప్రేక్షకులకు నచ్చే ఎంటర్‌టైనర్స్‌ను అందించడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల కంటే భిన్నమైన కోణంలో ఈ మూడో చిత్రం ఉంటుందని, అన్నీ కుదిరితే వచ్చే సంక్రాంతికి ఈ కొత్త సినిమాను విడుదల చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.