తమిళ యాక్షన్ హీరో విశాల్ తన కెరీర్‌లో 36వ సినిమా అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హిట్ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న ఈ సరికొత్త చిత్రానికి తెలుగులో ‘మొగుడు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం ప్రోమోను విడుదల చేసింది. విశాల్, సుందర్ సి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘మగ మహారాజు’, ‘మదగజరాజా’, ‘యాక్షన్’ సినిమాల తర్వాత వస్తున్న నాలుగవ చిత్రమిది కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా విడుదలైన ప్రోమో ఫుల్ ఫన్నీగా మరియు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆమె భర్తను శాసించే భార్యగా కనిపిస్తోంది. విశాల్ ఇంట్లో పనులు చేసే అమాయకపు భర్తగా నటిస్తూనే, భార్యకు తెలియకుండా బయట విలన్ల తాట తీసే మాస్ క్యారెక్టర్‌లో అదరగొట్టారు. “మొగుడులా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం” అంటూ యోగిబాబు చెప్పే డైలాగ్ ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, ACS అరుణ్ కుమార్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా విశాల్ కెరీర్‌లో మరో హిట్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సుందర్ సి మార్క్ కామెడీ మరియు విశాల్ మార్క్ యాక్షన్ కలగలిసిన ఈ ‘మొగుడు’ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























