ఉస్తాద్ భగత్ సింగ్ లో పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ 

Ustaad Bhagat Singh Features a Powerful Background Score

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి ఒక భారీ అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేకర్స్. ఈసినిమా నుండి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమాలో పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కూడా ప్లాన్ చేశారట.ఈ సాంగ్ ను టాప్ లిరిసిస్ట్ , ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ రాశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ప్రత్యేక గీతం పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌ను మరియు ఆయన పోలీస్ పాత్రలోని పవర్‌ను ఎలివేట్ చేసే విధంగా రాశారట.ఈ పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రంలో శ్రీలీల , రాశి ఖన్నా కథానాయికలుగా నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక ఇంతకుముందు పవన్ , హరీష్ , దేవి శ్రీ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు అదే కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.