నటీనటులు : రవితేజ , ఆషికా రంగనాథ్,డింపుల్ హయతి ,సునీల్ , సత్య
ఎడిటింగ్ :శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ళ
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
దర్శకత్వం :కిషోర్ తిరుమల
నిర్మాత :సుధాకర్ చెరుకూరి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం ట్రైలర్ హిలేరియస్ అనిపించడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది .ఇక ఈసినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా ఎలా ఉంది ? ఈసినిమానైనా రవితేజకు హిట్టిచ్చిందా ?లేదో రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
ఈ సినిమా కథ అంతా రామ సత్యనారాయణ (రవితేజ) అనే ఒక వైన్ బిజినెస్మెన్ చుట్టూ తిరుగుతుంది. తన వ్యాపార పనుల మీద స్పెయిన్ వెళ్లిన సత్య, అక్కడ మానస శెట్టి (ఆషికా రంగనాథ్)తో ప్రేమలో పడతాడు. అయితే, అప్పటికే సత్యకు భామని (డింపుల్ హయతి) అనే భార్య ఉంటుంది. తన భార్యకు తెలియకుండా ఈ ప్రేయసితో సత్య సాగించే రహస్య ప్రయాణం, ఆ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, నవ్వులు మరియు భావోద్వేగాల సమాహారమే ఈ చిత్రం.
విశ్లేషణ :
భార్య ,ప్రేయసి మధ్యలో నలిగిపోయే హీరో కథ తో ఇంతకుముందు చాలా సినిమాలే వచ్చాయి. అయితే ఈసినిమా రొటిన్ టెంప్లెట్ తో వచ్చినా చాలా వరకు ఎంటర్టైన్ చేసింది.ఇందులో వింటేజ్ రవితేజను ఈ సినిమాలో మళ్లీ చూడవచ్చు. ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. చాలా కాలం తర్వాత ఆయన తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించారు.సునీల్, సత్య మరియు వెన్నెల కిషోర్ త్రయం పండించిన కామెడీ థియేటర్లలో నవ్వులు పూయించింది.
ఫస్ట్ హాఫ్ : సినిమా ప్రారంభం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ, మొదటి 30 నిమిషాల తర్వాత కథ వేగం పుంజుకుంటుంది. రవితేజ మరియు సునీల్ మధ్య వచ్చే సన్నివేశాలు, స్పెయిన్ షెడ్యూల్లో వచ్చే విజువల్స్ ప్రేక్షకులను అలరిస్తాయి.ముఖ్యంగా సిచ్యువేషనల్ కామెడీ ఫస్ట్ హాఫ్‌కు ప్రధాన బలంగా నిలిచింది. ఇంటర్వల్ బ్యాంగ్ సరదాగా ఉండి, సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది.
సెకండ్ హాఫ్ : రెండో భాగంలో కథ కొంత నెమ్మదించినట్లు అనిపిస్తుంది, కానీ రవితేజ ఎనర్జీ మరియు సత్య, వెన్నెల కిషోర్ ఎంట్రీతో మళ్లీ పుంజుకుంటుంది. ముఖ్యంగా సైకియాట్రిస్ట్ సీన్లు మరియు ఆడిల్ట్ కామెడీ టచ్ ఉన్న కొన్ని జోకులు యువతను ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఇంకా బలంగా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, ఓవరాల్‌గా ఎంటర్టైనింగ్గా సాగుతుంది.
నటీనటుల నటన: రవితేజ ఈ సినిమాకు అతిపెద్ద బలం. చాలా కాలం తర్వాత తనదైన వింటేజ్ కామెడీ టైమింగ్ మరియు హై-ఎనర్జీతో అదరగొట్టారు.ఆషికా రంగనాథ్ & డింపుల్ హయాతి: హీరోయిన్లు ఇద్దరూ గ్లామర్ పరంగా మెరిశారు. అయితే వారి పాత్రలకు ఇంకాస్త స్కోప్ ఉంటే బాగుండేది. సునీల్ ‘దుబాయ్ శీను’ తరహా ఫన్ను మళ్లీ గుర్తు చేశారు. వెన్నెల కిషోర్ మరియు సత్య తమ పాత్రల పరిధి మేరకు నవ్వులు పూయించారు. మురళీధర్ గౌడ్, అజయ్ ఘోష్ తమ అనుభవంతో రాణించారు.
సాంకేతిక విభాగం:కిషోర్ తిరుమల తన మార్క్ క్లీన్ మేకింగ్ మరియు సెన్సిబుల్ హ్యూమర్‌తో సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మలిచారు. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా కథకు తగ్గట్లుగా వుంది ప్రసాద్ మూరెళ్ల విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. స్పెయిన్ లొకేషన్లను చాలా రిచ్‌గా చూపించారు.శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నీట్‌గా ఉంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈసినిమాను చాలా క్వాలిటీ తో నిర్మించారు.
మొత్తానికి, భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒక డీసెంట్ కామెడీ రైడ్.రవితేజ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమాలకంటే ఈసినిమా బెటర్ అని చెప్పొచ్చు. సంక్రాంతి సీజన్లో కుటుంబంతో కలిసి సరదాగా నవ్వుకోవడానికి ఆడియన్స్‌కు ఈ పండగ సీజన్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒక మంచి ఆప్షన్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























