అమెరికాలో అనగనగా ఒక రాజు జోరు 

Anaganaga Oka Raju Registers Strong Pre-Sales in the USA

స్టార్ బాయ్ నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం అమెరికా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ సినిమా యూఎస్ ప్రీ-సేల్స్‌లో ఇప్పటికే 1.65 లక్షల డాలర్లకు ($165K+) పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. మోక్ష క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని విదేశాల్లో విడుదల చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్ జనవరి 13 నుండి ప్రారంభం కానున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

నవీన్ పొలిశెట్టి గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా విదేశాల్లో భారీ వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమా కు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ఏమి ప్లాన్ చేయడం లేదు. జనవరి 14న ఉదయం 7గంటలనుండి థియేటర్లలో షోలు పడనున్నాయి. సినిమా విజయంపై టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది. అయితే ఈరోజు విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు రేపు రానున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అలాగే 14న విడుదలకానున్న నారీ నారీ నడుమ మురారి సినిమాలతో అనగనగా ఒక రాజు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదుర్కోవాల్సివుంటుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.