మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. తొలి షో నుండే సినిమాకు అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ అప్పుడే సక్సెస్ సెలబ్రేషన్స్‌ను ప్రారంభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పట్ల చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. సినిమా సక్సెస్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి మరియు సుస్మిత కొణిదెల కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు.ఈరోజు సాయంత్రం సక్సెస్ మీట్ నిర్వహించే ఛాన్స్ లేకపోలేదు.
చాలా కాలం తర్వాత చిరంజీవిని తన ట్రేడ్ మార్క్ కామెడీ టైమింగ్, గ్రేస్ మరియు మాస్ యాక్షన్‌తో చూశామని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఆయన ఎనర్జీ సినిమాకు ప్రాణంగా నిలిచింది.
అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 35 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ట్రెండ్ చూస్తుంటే మొదటి రోజు ఈసినిమా చిరుకి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించనుంది. సంక్రాంతి సెలవులు కూడా తోడవడంతో లాంగ్ రన్లో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
అనిల్ రావిపూడి ఓ మంచి ఫన్ & ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ను పండగ కి అందించారంటూ దర్శకుడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.ఇక అనిల్ ఈసినిమాతో మరోవిజయాన్ని అందుకున్నాడు. తనకు ఇది వరసగా 9విజయం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























