నారీ నారీ నడుమ మురారి నుండి హిలేరియస్ ట్రైలర్ రిలీజ్ 

nari nari naduma murari trailer out now

శర్వానంద్ హీరోగా  సామజవరగమన ఫేమ్  రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్ మరియు సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ ప్రారంభంలోనే సత్య  ఒక గర్భిణి స్త్రీ అని పొరపడి చేసే హడావిడి నవ్వులు పూయించింది. సాక్షి వైద్య మరియు శర్వానంద్ మధ్య నడిచే లవ్ ట్రాక్, దానికి సంబంధించిన ఆర్కిటెక్ట్ జాబ్ కామెడీ సీన్లు ఆకట్టుకున్నాయి.బిటెక్ చదివి వేరే ఉద్యోగం ఎందుకు చేస్తున్నావని అడిగే ప్రశ్నకు, ఏ ఇంజనీరింగ్ కుర్రాడు కూడా దీనికి సమాధానం చెప్పలేడంటూ శర్వా చెప్పే డైలాగ్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. అలాగే ఇళయ రాజా పై వేసిన సెటైర్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.సీనియర్ నటుడు నరేష్, శర్వానంద్ తండ్రి పాత్రలో నటించారు.

ఓవరాల్ గా ట్రైలర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు హిలేరియస్ గా సాగింది.ఈసినిమా, సామజవరగమన లా ఎంటర్టైనర్ చేయడం కావడం ఖాయం అనేలా వుంది.ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం పక్కా కమర్షియల్ హంగులతో ఫన్ & ఫ్యామిలీ డ్రామాగా వస్తుంది.జనవరి 14న సాయంత్రం 5:49 గంటల ఈసినిమా నుండి థియేటర్లలోకి రానుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.