నటీనటులు : చిరంజీవి , నయనతార , వెంకటేష్ , హర్షవర్ధన్ , అభినవ్ గోమఠం
సినిమాటోగ్రఫీ :సమీర్ రెడ్డి
ఎడిటింగ్ : తమ్మిరాజు
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
దర్శకత్వం : అనిల్ రావిపూడి
నిర్మాత : సాహు గారపాటి , సుష్మిత కొణిదెల
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్ గారు థియేటర్లలోకి వచ్చేసింది.ఈరోజు రిలీజ్ అయినా నిన్న రాత్రి నుండే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ పడ్డాయి. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు దానికి తోడు చిరంజీవి ఉండడంతో అనౌన్స్ మెంట్ దగ్గర్నుండే ఈసినిమా భారీ హైప్ తెచ్చుకుంది.సాంగ్స్ కూడా సూపర్ హిట్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా ఎప్పడు రిలీజవుతుందా అని చూశారు. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా ఎలా వుంది? అనిల్ రావిపూడి చిరుని ఎలా చూపించారు? ఈసినిమా తో తన సక్సెస్ స్ట్రీక్ కొనసాగించేడో లేదో రివ్యూ లో తెలుసుకుందాం.
కథ : శంకర వర ప్రసాద్ (చిరంజీవి) ఒక సమర్థుడైన ఎన్‌ఎస్‌ఏ (NSA) ఆఫీసర్. వృత్తిరీత్యా దేశాన్ని కాపాడే ఆయన, వ్యక్తిగత జీవితంలో భార్య శశిరేఖ (నయనతార)తో మనస్పర్థల కారణంగా విడిపోతాడు. తన పిల్లలకు దగ్గరవ్వడానికి, వారి ప్రేమను తిరిగి పొందడానికి ప్రసాద్ తన అసలు గుర్తింపును దాచిపెట్టి, వారి స్కూల్లో పీటీ టీచర్‌గా మరియు ఇంట్లో పనివాడిగా ఎలా చేరాడు? ఈ క్రమంలో ఎదురైన హాస్యాస్పద సంఘటనలు ఏమిటి? చివరకు తన కుటుంబాన్ని శత్రువుల నుండి ఎలా రక్షించుకున్నాడు? అనేదే ఈ చిత్ర కథ.
విశ్లేషణ : చాలా కాలం తర్వాత చిరంజీవి పూర్తిస్థాయి వినోదాత్మక పాత్రలో కనిపించారు. ‘చంటబ్బాయ్’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాల్లో ఆయన చూపించిన కామెడీ టైమింగ్ మళ్ళీ ఈ సినిమాలో కనిపించింది. ఆయన డైలాగ్ డెలివరీ, హావభావాలు మరియు సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులకు విందు భోజనంలా ఉన్నాయి.ఫస్ట్ 30 నిమిషాల అయితే ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా అనిపిస్తుంది. నయనతార , చిరుల మధ్య వచ్చే లవ్ ట్రాక్ ను కూడా ల్యాగ్ చేయకుండా నీట్ గా ప్రెసెంట్ చేశారు అనిల్.ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ ఫన్ తో రన్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక సెకండ్ హాఫ్ కూడా అదే ఫ్లో ను మైంటైన్ చేస్తూ ఆద్యంతం అలరించేలా వుంది. మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇవ్వడం చిరు ,వెంకీ ల ఎపిసోడ్ హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యింది. ఎమోషనల్ సన్నివేశాలను బాగా డీల్ చేశాడు అనిల్ రావిపూడి. ఓవరాల్ గా సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతూ ఎంటర్టైన్ చేసింది.
నటీనటుల విషయానికి వస్తే సినిమా అంతా చిరంజీవి వన్ మ్యాన్ షో చేశారు.చాలా చోట్ల వింటేజ్ చిరు కనిపించారు.తన కామెడీ టైమింగ్ అదుర్స్ అనిపించింది. దాదాపు ప్రతి సన్నివేశంలో చిరు స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. మెగా అభిమానులకు ఈసినిమా పెద్ద గిఫ్ట్. నయనతార తన పాత్రకు తగిన గంభీరతను, హుందాతనాన్ని జోడించి మెప్పించింది. చిరంజీవి మరియు నయనతారల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు పండాయి. ఇక విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్‌లో ఆయన ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి సినిమా జోరు పెరుగుతుంది. వీరిద్దరూ కలిసి పాత సూపర్ హిట్ పాటలకు స్టెప్పులు వేయడం సినిమాకే హైలైట్‌గా నిలిచింది.అభినవ్ గోమఠం , హర్షవర్ధన్ తమ పాత్రలతో నవ్వించారు. కేథరిన్ త్రెసా, మురళీ శర్మ, ప్రకాష్ రాజ్ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగం అనిల్ రావిపూడి మరోసారి తన మార్క్ కామెడీతో మ్యాజిక్ చేశారు. స్క్రీన్‌ప్లేలో ఆయన వేసిన మలుపులు, కామెడీ ఎపిసోడ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, ముఖ్యంగా ‘శశిరేఖ’ మరియు ‘మీసాల పిల్ల’ పాటలు విజువల్స్ పరంగా చాలా బాగున్నాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ దృశ్యాలను చాలా రిచ్‌గా చూపించగా ఎడిటింగ్ కూడా బాగానే వుంది.ఎక్కడా బోర్ కొట్టలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
ఓవరాల్ గా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఈ పండుగకు పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.చిరు నటన , ఫస్ట్ హాఫ్ , క్లైమ్యాక్స్ ,సంగీతం సినిమాలో హైలైట్ అయ్యాయి. ప్రీమియర్స్ నుండే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడంతో బాక్సాఫీస్ వద్ద ఈసినిమా భారీ వసూళ్లను రాబట్టుకోవడం ఖాయం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























