అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్ 

Anaganaga Oka Raju TRAILER Out Now

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ తాజాగా విడుదలైంది. నవీన్ పొలిశెట్టి తనదైన మార్క్ కామెడీ మరియు ఎనర్జీతో మరోసారి వెండితెరపై నవ్వుల విందు అందించబోతున్నారని ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి ‘రాజు’ అనే యువకుడి పాత్రలో కనిపిస్తున్నారు. తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే బాగుంటుందని, అప్పుడు మామగారి ఆస్తి మొత్తం (ఆయన భాషలో ఎఫెక్షన్) తనకే వస్తుందని ఆశపడే ఒక తమాషా మనస్తత్వం ఉన్న వ్యక్తిగా ఆయన పాత్రను పరిచయం చేశారు. మరోవైపు చారు (మీనాక్షి చౌదరి) ఒక చదువుకున్న తెలివైన అమ్మాయిగా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య సాగే ప్రేమాయణం, పెళ్లి ప్రయత్నాలు మరియు ఆ క్రమంలో ఎదురయ్యే కామెడీ సన్నివేశాలు ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి.

“ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీల్  జోన్ లోకి తీసుకొచ్చారు కదరా” అనే డైలాగ్‌తో సినిమాలో యాక్షన్ మరియు డ్రామా కూడా ఉండబోతోందని హింట్ ఇచ్చారు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు, మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు నిండుదనాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి.ఓవరాల్ గా ట్రైలర్   సినిమా  పక్కా హిట్ అనే  ఫీల్ తెప్పించింది. ఈ చిత్రం జనవరి 14, 2026న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.