హైందవ కీలక షెడ్యూల్ కంప్లీట్ 

HAINDAVA Crucial Schedule Completed

‘కిష్కింధపురి’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం అకల్ట్ థ్రిల్లర్ ‘హైందవ’ లో నటిస్తున్నారు. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గత నెలలో మారేడుమిల్లిలో జరిగిన ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ తర్వాత, చిత్ర బృందం ఇప్పుడు తమ నాల్గవ మెయిన్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్ర నిర్మాతలు ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఫెరోషియస్ మాస్ లుక్‌లో ఉన్న సాయి శ్రీనివాస్‌ సగం నీటిలో మునిగి ఉన్న ఒక పురాతన కట్టడంపై నిలబడి, అతని శరీరం నీటితో తడిసి, రక్తపు మరకలతో కనిపించడం ఆసక్తికరంగా వుంది. ఒక చేతిలో రక్తంతో తడిసిన గొడ్డలిని పట్టుకుని, మరో చేతిలో మండుతున్న ముసుగు, అతని వెనుక మెరిసే కళ్ళు  భారీ కోరలతో ఉన్న ఒక పెద్ద వరాహం కనిపించడం ఇంటన్సిటీని మరింత పెంచింది.  

సినిమా నిర్మాణంలో 70% పూర్తయిందని నిర్మాతలు తెలియజేశారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌లో ఎక్కువ భాగం కథలోని మిస్టరీని, డ్రామాటిక్ టెన్షన్‌ను బలంగా నిలబెట్టే కీలక సన్నివేశాలకు కేటాయించారు.ఈ సినిమా కథ శతాబ్దాల నాటి దశావతార ఆలయం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన సంయుక్త కథానాయికగా నటిస్తోంది. మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవా, జెడి చక్రవర్తి, శివాజీ రాజా, గెటప్ శ్రీను వంటి నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 హైందవకు టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. సామ్ సిఎస్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు, హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ పర్యవేక్షిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్  ఎడిటర్. ఈఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.