మన శంకరవరప్రసాద్ గారు నుండి మెగా విక్టరీ మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్   

Mega Victory Mass Song Promo Released from Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి నుండి నెక్స్ట్ వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు.ఇందులో మరో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించడం తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. ఇక సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ‘మెగా-విక్టరీ మాస్ సాంగ్’ ప్రోమో విడుదలైంది. ఈ సాంగ్ ప్రోమో ఇద్దరు దిగ్గజ హీరోల అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.కలర్ ఫుల విజువల్స్ తో పార్టీ సాంగ్ గా రానుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు అనిల్ రావిపూడి , ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ప్రేమ్‌లో మాస్ స్టెప్పులతో చూపించి మెప్పించనున్నారు. ఈ మాస్ నంబర్‌కు భీమ్స్ సిసిరోలియో అందించిన ఎనర్జిటిక్ బీట్స్ మరియు ఊపు ఇచ్చే సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. చిరంజీవి గ్రేస్ మరియు వెంకటేష్ టైమింగ్ కలిసి ఈ పాటను ఈ ఏడాది ‘మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా మార్చేలా కనిపిస్తున్నాయి.ఈనెల 30న ఫుల్ లిరికల్ సాంగ్ రానుంది.ఇప్పటికే విడుదలైన రెండు పాటలు  ఊహించని విధంగా  చార్ట్ బస్టర్స్  అనిపించుకున్నాయి.  

ఇక ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించగా  చిరంజీవి, వెంకటేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలైట్ అవ్వనున్నాయి. షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.