ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా ఛాంపియన్ నైట్ ఈవెంట్ నిర్వహించారు.
ఛాంపియన్ నైట్ లో హీరో రోషన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. అలాగే మాకు ఎంతగానో సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. ప్రదీప్ గారు ఈ ప్రాజెక్టు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ సినిమా తప్పితే మరో సినిమా చేయనని అప్పుడే డిసైడ్ అయిపోయాను. సినిమా మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ప్రదీప్ గారి విజన్ ని స్వప్న గారు నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. ఎందుకంటే స్వప్న గారు పీరియడ్ సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్. పీటర్ మాస్టర్, మది గారు, తోటగారు అందరు కూడా అద్భుతమైన వర్క్ ఇచ్చారు.పీటర్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లో నాకు కొన్ని గాయాలు కూడా అయ్యాయి.ఆయనతో మళ్లీమళ్లీ యాక్షన్ సీన్లు చేయాలని కోరుకుంటున్నాను.
కిరణ్ గారు పదేళ్ల క్రితం నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే జీకే మోహన్ గారు కూడా ఎప్పుడు నాతోనే ఉంటారు. వారికి ధన్యవాదాలు. బైరాన్ పల్లి వీరులందరికీ థాంక్యూ. వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు .ఎడిట్ చూశాను. అందరు కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. వైజయంతిలో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వైజయంతి మూవీస్, స్వప్న, ప్రియాంక అక్క థాంక్యూ సో మచ్. దత్ గారు లెజెండ్రీ ప్రొడ్యూసర్. ఎంతో మందిని మన ముందుకు తీసుకువచ్చారు. ఎంతోమంది హీరోలని లాంచ్ చేశారు. నన్ను కూడా ఛాంపియన్ ద్వారా తీసుకొస్తున్నందుకు థాంక్యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























