షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలుగా వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా రానున్న చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అంచనాల్ని మరింతగా పెంచేందుకు శంబాల మిస్టిక్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని చేత ఆదివారం నాడు విడుదల చేయించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆకాశం నుంచి ఓ ఉల్క పడటంతో ట్రైలర్ మొదలైంది. పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైనది కాదు.. అనే డైలాగ్‌తో ఆ ఉల్క శక్తిని చూపించారు. ఇక ఊర్లో అందరూ వింతగా ప్రవర్తిస్తుండటం, ఆ ఉల్కను కట్టడి చేసేందుకు పూజలు చేయడం, మఠాధిపీఠాల్ని తీసుకు రావడం చూపించారు. ఇక మిస్టరీని ఛేదించేందుకు నాస్తికుడైన హీరో రంగంలోకి దిగడం మీ ‘కాశీ, కాకమ్మ, మజిలీ కథలు ఊరి జనాలకు చెప్పండి.. నాక్కాదు’ అని అనడం చూస్తే అతని పాత్ర ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.
ఊర్లో వరుసగా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ‘ఇప్పటి నుంచి మీ పిచ్చితనానికి ఎవ్వరినీ బలికానివ్వను.. అది ఆవైనా సరే.. చీమైనా సరే’ అని హీరో పరిష్కారం కనిపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఊరికి వ్యతిరేకంగా హీరో చేసే పోరుని ట్రైలర్లోనే అద్భుతంగా చూపించారు. ఇక ఇందులో ప్రవీణ్ కె బంగారి చూపించిన విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుందనిపిస్తోంది. ట్రైలర్ చివరి సీన్ మాత్రం ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టించినట్టుగా అనిపిస్తుంది.ఇప్పటికే ‘శంబాల’ మేకర్లకు లాభసాటి ప్రాజెక్ట్‌గా మారింది. అన్ని రకాల హక్కులు హాట్ కేకులా అమ్ముడయ్యాయి. రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్స్‌తో నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























